తెలుగు తేజం, విజయవాడ : ఇంద్ర కీలాద్రిఫై కొలువైన కనకదుర్గమ్మకు బెంగుళూరుకు చెందిన
జి. మంజునాధ్ అనే భక్తుడు అమ్మవారికి అలంకరించేందుకు రూ. ౭ లక్షలు విలువ చేసే (138.5 గ్రాముల ) బంగారంతో తయారు చేయించిన నగిషీ హారం, జత గాజులు, చెవిబుట్టలను, వీటితోపాటు 1.163కిలోగ్రాముల వెండి కంచం, రెండు కుందులు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దుర్గగుడి అధికారులకు వీటిని అందజేశారు. దాత దసరా ఉత్సావాల రోజున మొక్కు చెలించుకుందామని ప్రయత్నం చేసినప్పటి సాధ్యం కాక పోవడంతో ఇప్పుడు చెల్లించు కున్నట్లు తెలిపారు. దాత కుటుంబానికి దేవస్థానం ఏఈవో తిరుమలరావు వారికి విరాళం రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.