ఈనెల 6 వ తేధిన విచారణ
విచారణ అధికారిగా సబ్ కలెక్టర్
ఆధారాలు సమర్పించాలని ఇరుపక్షాలకు ఆదేశాలు
విజయవాడ : ప్రభుత్వం విజయవాడలోని ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకోని నగర పరిధిలో ఉన్న 2వేల మందికి యునియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కల్పించి ఎన్నికలు జరపాలని కోరుతు ఈనెల స్పందనలో జర్నలిస్టులు ఫిర్యదుకు స్పందించి ఇరుపక్షాలకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారి చేశారు.6వతేధి మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పక్షాలు తమ దగ్గర ఉన్న ఆధారలు తీసుకోని హజరు కావాలని ఆదేశించారు. విజయవాడ నగర పరిధిలో దాదాపు 2 వేల మంది అక్రీడేషన్ సభ్యులు మరో వెయ్యి మంది నాన్ జర్నలిస్టులు ఉన్నారు. అయితే కేవలం తమ యునియన్ సభ్యులైన 122 మందిని ప్రెస్ క్లబ్ సభ్యలుగా చూపడం జరుగుతోంది.ఈ విషయాన్ని స్పందనలో ఫిర్యాదు చేయగా సబ్ కలెక్టర్ స్పందించి నోటీసులు జారి చేయడం పట్ల నగరంలోని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెలికి తీసి ప్రెస్ క్లబ్ ను స్వాధినం చేసుకొని జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కల్పించి ఎన్నికలు జరిగేలా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని నగరంలోని జర్నలిస్టులు కోరుకుంటున్నారు.