హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును వెతిరేకిస్తు రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదు. నిరసనలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు రైతులు. భారత్ బంద్ కు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా, ఉద్యోగ, ట్రాన్ఫోర్టు సంఘాలు మద్దతు తెలిపారు. తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 3 గంటలవరకు రోడ్డెక్కే పరిస్థితులు కనిపించడంలేదు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సోమవారం రాత్రి యధావిధిగా బయలు దేరాయి.. మంగళవారం ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రైతులు చేస్తున్న బంద్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్ చేయనున్నట్లు ఆటో డ్రైవర్స్ యూనియన్ల ఐకాస ప్రకటించింది.