తెలుగు తేజం, జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జన్మదిన శుభ సందర్భముగా జగ్గయ్యపేట ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల వెంకట లక్ష్మీనారాయణ జగ్గయ్యపేట పట్టణంలో ఆర్యవైశ్య కార్యాలయము నందు చత్రపతి చిత్రపటము నకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి భగవంతుని ప్రార్ధించారు. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజా చత్రపతి మహిళలకు రక్షణ కల్పించాలని, రైతుకు రక్షణగా నిలిచారని, సైనికులకు ీతభత్యాలు ఏర్పాటు చేశారని, భారతజాతి గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ
ఆంధ్రరాష్ట్ర వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కొత్త పురుషోత్తం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర సేవా సమితి చైర్మన్ సన్నే రామారావు, నోముల సత్యనారాయణ, వరగాని రాజశేఖర్, నోముల శివ, మారం రామకృష్ణ, స్వామి కృష్ణ, పొత్తూరి రవికుమార్, వంశీకృష్ణ, కంభంపాటి వంశీకృష్ణ,గల్లా సిద్దు మరియు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.