తెలుగు తేజం, మంగళగిరి : ఈ నెల 25 ముక్కోటి ఏకాదశి సందర్బంగా స్థానిక శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు చేసిన ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి (ఆర్కే) పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలని, కరోనా దృష్టిలో ఉంచుకుని దర్శనానికి వచ్చే ప్రతీ భక్తునికి మాస్క్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, అందరికి శానిటైజ్ చేసి దర్శనానికి పంపించాలని దేవాలయ అధికారులను, ట్రస్ట్ బోర్డ్ సభ్యులను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. అనంతరం దేవస్థానం అతిధి గృహాలను పరిశీలించారు సరైన వసతులు లేవని అధికారులను తక్షణమే అతిధి గృహాలకు సరైన వసతులు ఏర్పాటు చేసి అవసరమైన మరమ్మత్తులు చేయించాలని అధికారులను కోరారు.