తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు సమకూర్చాలనే ముఖ్యంగా ఉద్దేశంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కంచికచర్ల అంబేద్కర్ నగర్, అరుంధతీ కాలనీ లకు 9 అంగుళాల మంచినీరు పైప్ లైన్లు విస్తరణ పనులకుగాను 15 వ ఆర్ధిక సంఘం నిధులు 21.40 లక్షల రూపాయల నిధులతో చేయనున్న పనులును శుక్రవారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పర్యవేక్షించారు . ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.ఎన్నో ఏళ్ళ క్రితం వెసిన పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వలన, నాలుగు అంగుళాల పైప్ లైన్లు వలన మంచినీరు చివరి ఇంటి వరకు మంచినీరు సరఫరా చేయడం కష్టం గా ఉండేదాన్ని, దానిని దృష్టిలో ఉంచుకొని 15వ ఆర్థిక సంఘం నిధులు 21.40 లక్షల రూపాయలతో పైప్ లైన్లు విస్తరణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. అలాగే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు గుర్తించి సుమారు 6 కోట్ల రూపాయలతో పట్టణంలో డ్రైనేజీ పనులకు గాను నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, పరిటాల రాము అబ్బూరి నాగమల్లేశ్వరరావు జెడ్ పి టి సి అభ్యర్థి వేల్పుల ప్రశాంతి, వేల్పుల శ్రీనివాసరావు, అమర్లపూడి యెహన్, మాడుగుల మధు మంగళంపూడి కోటి బాబు, మంగళంపూడి సన్నీ, వేల్పుల రమేష్ మార్తా శ్రీనివాసరావు మన్నెం శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్, హరి,పులా రాంబాబు,సుర్యదేవర రవి తదితరులు పాల్గొన్నారు.