మచిలీపట్టణం : బందరు ప్రత్యేకతల్లో దసరా కు నిర్వహించే శక్తిపటాలు ఊరేగింపుకి దేశంలోనే ఒక ప్రాముఖ్యత ఉంది. దుర్గమ్మ కొలువైవున్న ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు తీసిపోకుండా బందర్లో శక్తిపటాలు విన్యాసాలు,పులివేషాలు, అఘోరీలు,విజయదశమి రాత్రి జరిగే జమ్మికొట్టుడు …కనులపండుగగా జరుగుతాయి.వేరే రాష్ట్రాల వారు, వేరే రాష్ట్రాలలో స్థిరపడ్డ ఈ ఊరువారు తప్పకుండా వచ్చి పండగ చూస్తారు.
“ఈ సారి మాత్రం కరోనా వలన దసరా ఉత్సవాలకు అనుమతి లేదు. శక్తిపటాలు ,ఊరేగింపులు అనుమతిలేదు.ఒక్కొసారికి 10మందికి మించి ఆలయ ప్రవేశం లేదు.తీర్థ,ప్రసాదాలు లేవు.అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని” ..డిఎస్పీ “మహబూబ్ భాషా”అన్నారు.