తెలుగు తేజం గుడివాడ: స్థానిక ఎన్నికల విషయంలో కోర్టులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఆ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు కూడా సిద్ధంగాలేరని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమకు ఎన్నికలు ముఖ్యం కాదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగుతోందని.. ఎన్నికలు జరగకపోయినా ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు వాయిదావేస్తే ఎవరికి నష్టమో తెదేపా అధినేత చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చెప్పాలని మంత్రి వ్యాఖ్యానించారు.