“స్ఫూర్తి కుటుంబం”ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రస్థాన సాధన కార్యక్రమం సందర్భంగా తెలుగు తేజం దిన పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం
వర్తమాన ప్రపంచం యావత్తు అభద్రతలో కొట్టుమిట్టాడుతోంది.
ఒకవైపు ప్రపంచం యావత్తూ మానవ ప్రేరిత కరోనా కోరల్లో చిక్కుకుని ఎలా బయటపడాలో తెలియక బిక్కు బిక్కు మంటూ ఉంది.
మరోవైపు ఆర్థిక సంక్షోభంతో దేశాలకు దేశాలే విలవిల్లాడుతున్నాయి.
పెరిగిపోతున్న పేదరికం కొద్దిమంది చేతుల్లో సంపద ఇబ్బడిముబ్బడిగా గుట్టలు పడిపోవడం వర్తమాన ప్రపంచం ముందు ఉన్న పెను సవాలు.
మనిషిగా చూస్తే భద్రత లేని జీవితం. నిత్యం అశాంతి, ఉరుకుల పరుగుల జీవితంతో జీవనం కడు కష్టంగా మారింది.
సామాజిక భద్రతను కల్పించవలసిన రాజకీయం అవినీతి మయంగా తయారైంది.
మానసిక ప్రశాంతతను ఇవ్వవలసిన మతం మారణహోమం లకు వేదిక అవుతుంది.
మరి వీటిని సరిదిద్దే వారే లేరా? మానవాళి ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ప్రత్యామ్నాయం ఉందా ?
మనిషి మనిషిగా సమాజంలో బ్రతికేందుకు మార్గం లేదా?
భవిష్యత్ తరాలకు సామాజిక భద్రత కలిగిన సమాజాన్ని అందించలేమ?
అందుకు మార్గమే లేదా?
ఇవి నేటి మానవాళి ముందున్న సవాళ్ళు .
కారు చీకటిలో చిరు దీపమై నా దారి చూపిస్తుంది అన్నా ఆధ్యాత్మిక విశ్వ గురువు, భవిష్యత్తు తరాల వేగుచుక్క ,భౌతిక ఆధ్యాత్మిక జీవిత సమన్వయ సాధ్యతే లక్ష్యంగా కఠోర దీక్షతో మానవాళి మనుగడ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత మానవతావాది శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు మానవాళికి ప్రసాదించిన ప్రస్థాన సాధన మార్గమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమని నేడు జరుగుతున్న ప్రస్థాన సాధనలో అనుభవాలను చూస్తే అర్థమవుతుంది.
విశ్వ మానవాళి నేడు ఎదుర్కొంటున్న అన్ని విషమా సమస్యలకు మనిషి యొక్క పకృతి ప్రేరేపిత పంచేంద్రియ మనసే కారణమని గుర్తించి ఆ మనసు మరో మనసు గా మానవత్వపు పరిమళాలు వెదజల్లే దిశగా అడుగులు వేయడానికి శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అందిస్తున్న ధ్యాన మనో ప్రస్థాన సాధన విధానం లో మానవాళి ప్రయాణించినప్పుడు మానవాళిని వెన్నాడుతున్న ఈ భౌతిక సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అర్థమవుతుంది. ప్రతి మనిషి తన మనసు పై పట్టు సాధించి, అంతరాత్మకు మనసుని దాసోహం చేసినప్పుడు చెడుని త్యజించి మంచి వైపు మనిషి ప్రయాణం సాగుతుందని అందుకు ఈ సాధన ఒకటే ఏకైక మార్గమని ప్రస్థాన సాదనలో పాల్గొంటున్నా పలువురు సాధకులు తెలియజేశారు.