తెలుగు తేజం జగ్గయ్య పేట మండల పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామం లో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్న పోటు శ్రావణి తన యాభై కుటుంబాలలో ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచింది ఆ కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన సొంత ఖర్చుతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు ఆ కుటుంబానికి అందించి మానవత్వం చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను గడపగడపకు చార వేయడమే కాక మానవతా దృక్పథంతో కుటుంబ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఉన్న దానిలో కొంత పేదవారికి సహాయపడుతున్న శ్రావణి నీ గ్రామ పెద్దలు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభినందించారు. ఈ నేపథ్యంలో తను చేసే ఈ చిన్న సహాయం షేర్ మహమ్మద్ పేట గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శనాల కమలేష్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శిరంశెట్టి వీర రాఘవులు చేతుల మీదుగా అందించినట్లు తెలియజేశారు. అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి వాలంటీర్ల ప్రోద్బలంతో అత్యంత ప్రజాదరణ పొందడం విశేషమని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని గ్రామ అధ్యక్షుడు కమలేష్ తెలియజేశారు