తెలుగుతేజం, వత్సవాయి : కరోనాకి నువ్వు ఒక ప్రాణం మాత్రమే, ప్రభుత్వానికి నువ్వొక అంకె మాత్రమే, కానీ ‘కుటుంబానికి నువ్వు ఒక అమూల్యమైన వ్యక్తివి’ మన భద్రత మనమే తీసుకోవాలి అని ఇంచార్జ్ ఎస్ ఐ మహా లక్ష్మణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రపరుచుకోండి అత్యవసర పరిస్థితిలో నే ఇంటి నుండి బయటకు రావాలని, బయటికి వచ్చినప్పుడు మనిషికి మనిషి దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి భద్రతా నియమాలు పాటిస్తే కరుణ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అన్నారు. అలాగే నేడు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవంను 20 మందితో నిబంధనలు పాటిస్తూ కళ్యాణం నిర్వహించుకోవాల్సిందిగా తెలపడమైనది. కావున ప్రజలందరూ కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా పైవిషయాన్ని గమనించి పూజా కార్యక్రమాలు తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని కోరడమైనది.