కనిగిరి, (తేజం ప్రతినిధి) : ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు, శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ సభ్యులు, మరియు మదర్ సేవా సమితి సభ్యులు ఈర్ల గురవయ్య ఇటీవల అస్వస్థతకు గురై మెరుగైన వైద్యం చేయించుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా కనిగిరిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. మదర్ సేవా సమితి గురువయ్య సహచర సభ్యులు మంగళవారము గురవయ్య స్వగృహానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంపై అశ్రద్ధ విడనాడి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలని, డాక్టర్లు సూచించిన ఆహార పదార్థాలను పాటించాలని మదర్ సేవా సమితి అధ్యక్షులు ఎస్ ఎన్ రసూల్ మరియు సభ్యులు పేర్కొన్నారు.