* అజిత్ సింగ్ నగర్ సిఐ లక్ష్మీనారాయణ
విజయవాడ సెంట్రల్ తెలుగు తేజం ప్రతినిధి: తాగి వాహనాలు నడపొద్దని విజయవాడ అజిత్ సింగ్ నగర్ సిఐ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ డాబా కొట్టులు సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుచేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా పలు వాహనాలను నిలిపి తనిఖీచేశారు. ఐదు మోటర్ సైకిల్లు సీట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజలు సురక్షిత ప్రయాణాన్నిఆశ్రయించాలని అనవసరంగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికా వద్దన్నారు. డ్రంక్అండ్ డ్రైవ్ లో పట్టుబడితే అనవసరంగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, వాహనాలుకూడా సీజ్ అవుతాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో శిక్ష మరియు జరిమానా కూడావిధించాల్సివస్తుందనిహెచ్చరించారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.నగరంలో విరివిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించాలనిసూచించారు.