తెలుగు తేజం, చందర్లపాడు: మండలంలో కొడవటికల్లు గ్రామంలో బుధవారం స్థానిక గ్రామ సర్పంచ్ చావల రవిబాబు ఆధ్వర్యంలో గ్రామంలోని సుమారు 150 గేదెలకు పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి చందర్లపాడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జ్యోతి బాబు, దుర్గయ్య పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో గేదెలకు మరియు పాడి గేదెలకు వైద్య పరీక్షలు నిర్వహించామని బలానికి, పాల దిగుబడికి, గుండె పురుగు మందులు అందజేశామన్నారు. పశువులకు సరైన పౌష్టికాహారం ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటాయని రైతులకు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల కన్వీనర్ కందుల నాగేశ్వర రావు, మాజీ సర్పంచ్ వేగినేటి సుబ్బారావు, సొసైటీ మాజీ అధ్యక్షులు కందుల బుచ్చి రామయ్య,సొసైటీ అధ్యక్షులు జంపాని నాగేశ్వరావు, మండల బీసీ నాయకులు రాచబంటి కోటేశ్వరావు, మరియు రైతులు మండాది కోటేశ్వరావు,మండాది నరసింహారావు, గోపాలమిత్ర వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ చావల రవిబాబు చేతుల మీదుగా పాడి రైతుల పశువుల దాన అందజేశారు.