తెలుగు తేజం, మోపిదేవి : మోపిదేవి లో వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు ప్రధాన అర్చకులు బుద్ధి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి శేష వస్త్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు ఆయనకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు