తెలుగు తేజం, మచిలీపట్నం : రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆర్డీవో ఖాజావలి అన్నారు. గుండుపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో సందర్శించి రైతులతో మాట్లాడారు. రంగుమారిన ధాన్యానికి రైతుల సమక్షంలోనే తేమశాతం నిర్ధారి స్తారన్నారు. ఎంత రేటు వస్తుందో లెక్కకట్టి రైతులకు చెల్లిస్తారన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు దెబ్బతిన్న పంటలు ఎన్యూమరేషన్ డిసెంబర్ 15లోగా పూర్తి చేసి నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నారు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయడం జరిగింది అన్నారు ఈ విషయాలను క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ సునీల్‌బాబు, ఏవో నూరున్నీసా పాల్గొన్నారు.