తెలుగు తేజం, విజయవాడ : నివర్ తుఫాను ప్రభా వంతో కురిసిన భారీవర్షాలకు జిల్లాలో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, పండిం చిన పంటను కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. తన క్యాంపు కా ర్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ నవంబరు 27, 28న కురిసిన భారీవర్షాలకు జిల్లాలో 1.84 లక్ష ల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చిందన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పంటనష్ట వివరాలను సేకరిస్తున్నారన్నారు. 15 నాటికి మొత్తం జాబితాను పూర్తి చేసి 30 నాటికి రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సీడీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు నియోజకవర్గాలు బాగా నష్టపోయాయన్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కౌలురై తులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సుమారు 90శాతం మంది కౌలురైతులు ఈ- క్రాఫ్ట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకు న్నారన్నారు. పంటనష్ట వివరాలపై రైతులు తమ సందేహాలు చెప్పేందుకు 1800 425 440 ట్రోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిం దన్నారు. జేసీ.కె.మాధవీలత, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు పాల్గొన్నారు.