విజయవాడ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ ని గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ మర్యాదపూర్వకంగా కలసి పలు శాఖాపరమైన అంశాలు గురించి సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా అజయ్ జైన్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలు మరియు పక్కా ఇళ్ళు గురించి మంత్రి శ్రీ జోగి రమేష్ కి వివరించారు.