తెలుగు తేజం, మచిలీపట్టణం : కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం ఏర్పడి ఏడాదైన సందర్భంగా బ్యాంకు ప్రధాన కార్యాలయం మచిలీపట్నం లో చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు డైరెక్టర్ వేములకొండ రాంబాబు శనివారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ‘కృష్ణా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు దేశంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు చేరువయ్యిందని. సహకార వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 27.25 శాతం వృద్ధి రేటు ఉందని రెండు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు కేడీసీసీ బ్యాంకు టర్నోవర్ చేరుకుందన్నారు. గడిచిన కాలంగా 1,100 కోట్ల రూపాయల వ్యాపారం పెరిగిందని పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన నాటికి ఆరో స్థానంలో ఉన్న కేడీసీసీ బ్యాంకు ఇప్పుడు రెండో స్థానంలో చేరుకుందన్నారు మొదటి స్థానంలో ఉండాల్సిన జిల్లా బ్యాంకు టీడీపీ హయాం 2017 లో జరిగిన 29.5 కోట్ల స్కాం తో వెనుకబడి ఉందన్నారు 2021 నాటికి దేశంలో 640 జిల్లాలలో కేడీసీసీ బ్యాంకు మొదటి స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు పాలకవర్గం వచ్చినప్పటి నుండి రైతు సంక్షేమమే ధ్యేయంగా కొత్త పథకాలతో ప్రవేశ పెట్టి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. బంగారంపై లోని మొత్తం 40 లక్షల వరకు పెంచి వడ్డీ శాతం 71 పైసలకు అందించడం జరుగుతుందన్నారు నాబార్డ్ అనుమతితో విజయవాడలో మూడు గోల్డ్ లోన్ బ్రాంచీలు ప్రారంభించామన్నారు. పట్టణాలు గ్రామాల్లో కేడీసీసీ బ్రాంచీలు లేనిచోట అదనపు కౌంటర్లు ప్రారంభించి రైతులకు మరింత చేరువయ్యేందుకు పాలక వర్గం ఆమోదించిందని తెలిపారు. వడ్డీ రేట్లు పెంచే విధంగా పాలకవర్గ నిర్ణయం తీసుకుందని దీంతో కేడీసీసీ బ్యాంకు లో పొదుపు ఖాతాదారులకు జాతీయ బ్యాంకులలో లేనివిధంగా వడ్డీ రేటు 4.5 శాతం అందుతుందన్నారు. అప్కోబ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలతోపాటు కృష్ణాజిల్లాలో కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కంప్యూటరైజేషన్ అవుతుందని రైతు సోదరులకు టెక్నాలజీ సహకారంతో చేరువవుతామన్నారు. జిల్లా బ్యాంకుల్లో 81 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు వచ్చే నెల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీఈవో రాజయ్య, జీఎం చంద్రశేఖర్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్లు పాల్గొన్నారు.