తెలుగుతేజం, వత్సవాయి: వత్సవాయి మండలంలోని ప్రజలకు తాసిల్దార్ ఉదయ భాస్కర రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కరోనా ఉదృతి దృష్ట్యా బహిరంగ ప్రదేశములలో చలువ పందిళ్లు వేసి శ్రీరాములవారి కళ్యాణములు నిర్వహించుటకు అనుమతులు లేవని, గుంపులు గుంపులుగా తిరగకుండా
పండుగను కుటుంబ సభ్యులతో కలసి ఇండ్లలోనే జరుపుకోవలని అన్నారు.
45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోవిడ్ టీకా పూర్తిగా సురక్షితమైనదని, కోవిడ్ టీకా పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు చరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ శానిటేజర్ ను వాడాలని అన్నారు. కోవిడ్ పట్ల ఏ మాత్రం అనుమానం ఉన్న సమీప ఆరోగ్య కేంద్ర సిబ్బందిని గాని, రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ సిబ్బందిని సంప్రదించవలెనని, ఎట్టిపరిస్థితిలోనూ అశ్రద్ధ చేయకుండా సొంత వైద్యం చేసుకోవద్దని ఆయన తెలిపారు. సొంత వైద్యం వల్ల వైద్యం వికటించిన తన కుటుంబానికి దూరమవుతారని, ప్రతి ఒక్కరు వైద్య అధికారిని సం
ప్రదించాలని వారి సలహాలు సూచనలు మేరకే ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.