- బురదలో మహిళా ఎస్ ఐల పరుగుపోటీలు..!!
- ఉన్నతాధికారులు స్పందించాలని అభ్యర్థులు ఆవేదన
ఏలూరు, తెలుగు తేజం న్యూస్ ప్రతినిధి : మహిళ ఎస్సై పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ నిర్వహిస్తున్న మైదానం వర్షం కారణంగా ముద్దయిపోవడంతో సరిగా ఈవెంట్స్ నిర్వహించలేకపోయామని మహిళా అభ్యర్థినులు నిరసన వ్యక్తం చేశారు… ఏలూరు జిల్లా ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన 535 మంది మహిళా అభ్యర్థినులకు అడ్మిట్ కార్డులు ఇవ్వగా 260 మంది అభ్యర్థినులకు ఎత్తు, 1600, 100 మీటర్ల పరుగు పందెం , లాంగ్ జంప్ పోటీ పరీక్షలు నిర్వహించారు. వర్షం కారణంగా మైదానం తడిసిపోవడంతో పరుగుకు ఆటంకం కలిగిందని,, తొందరగా అవచేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని ప్రవేశపెట్టారని అభ్యర్థినులు ఆవేదన వ్యక్తంచేశారు.దీంతో ఈవెంట్స్ సరిగా చేయలేకపోయామని, మరో అవకాశం కల్పించాలంటూ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు .. మళ్లీ నాలుగైదు సంవత్సరాలు తర్వాత నోటిఫికేషన్ రావడం లేదని ఇతరులను వర్షం కారణంగా వాయిదా వేయకుండా గ్రౌండ్లోని బురదలోని ఈవెంట్స్ పెట్టడం వల్ల తాము ఈవెంట్స్ చేయలేకపోయమన్నారు.. దీని వల్ల తమ భవిష్యత్తు పోతుందని అధికారులు తమకు న్యాయం చేయాలన అభ్యర్థులు కోరారు.