బాపట్ల: విహారయాత్రల పేరుతో విద్యార్థుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి విద్యాసంస్థలను వ్యాపార సంస్థలు గా మార్చుకున్న వలేటి రాజశేఖర్, పాటిబండ్ల కృష్ణారావువులపై( శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామనగరం, శ్రీ అనుజ్ఞ హైస్కూలు వేటపాలెం) క్రిమినల్ చర్యలు తీసుకొని విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి.విహారయాత్రల పేరుతో విద్యార్థుల నుండి ఒక్కొక్కరి నుండి అధిక మొత్తంలో రూ.8,000/- లు యాజమాన్యం వసూలు చేసినట్లు సదరు విద్యాసంస్థల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సకిలేరు వాగులో దుర్మరణం చెందిన ముగ్గురు బాలికల కుటుంబాలకు విషాదం మిగిల్చిన సదరు విద్యాసంస్థల యాజమాన్యం, విహార యాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలన ముగ్గురు బాలికలు ప్రాణాలను కోల్పోయారు. వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులు సెల్ఫీ దిగడానికి వెళ్లి వాగులో కొట్టుకుపోయారని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు.సదరు విద్యాసంస్థల యాజమాన్యం ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని వదిలి, నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు.సదరు విద్యాసంస్థల్లో యజమాని అయిన వలేటి రాజశేఖర్ గతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అక్రమంగా డబ్బులు వసూలు చేసిన విషయమై వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు FIR NO. 18/2022నమోదు అయినది. వలేటి రాజశేఖర్ రెండవ భార్య గోలి నాగలక్ష్మి పిల్లలను కనే విషయమై భర్తతో గొడవపడిన సందర్భంలో, ఆమెతో పిల్లలను కన్నపక్షంలో తన ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందని, నాగలక్ష్మి హత్య చేసిన విషయమై చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు అనుమానాస్పద మృతి కింద FIR NO.215/2022 నమోదైనది.విద్యా సంస్థల యజమానులు వలేటి రాజశేఖర్, పాటిబండ్ల కృష్ణారావు మరియు యాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయులందరిపై క్రిమినల్ చర్యలు తీసుకొని, విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. ఈ విషయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎస్పీ, ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని దుర్మరణం పాలైన ముగ్గురు బాలికల కుటుంబాలను అన్ని విధాల ఆదుకొని సహాయం శ్రీ వారికి అండగా నిలవాలి.