తెలుగు తేజం, జగ్గయ్యపేట : వైయస్సార్ జగనన్న రికార్డుల సమగ్ర రీ సర్వే లో వచ్చే ఫలితాలు పూర్తిగా వివాదాలకు అతీతంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. రీ సర్వే మోడల్ గ్రామంగా ఎంపికైన జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లోని ఈనెల 21న ముఖ్యమంత్రి స్వయంగా శాశ్వత, భూ రక్షణ పథకాన్ని ప్రారంభించ నున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో తక్కెళ్ళపాడు లోని సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ గ్రామం మొత్తంమీద ఉన్న 640 భూముల్లో 190 భూములకు సంబంధించి 140 మంది నుంచి అభ్యంతరాలపై అర్జీలు వచ్చాయని వీటిలో 155 భూములకు సంబంధించి వివాదాలు పరిష్కరించామని ఇంకా 35 భూములపై పరిష్కారం ప్రయత్నం జరుగుతోందని ల్యాండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ ఏడి సూర్యారావు తెలిపారు మరో వారంలో గా అన్ని వివాదాలు పరిష్కరించే సమగ్రమైన రీతిలో పకడ్బందీగా పట్టాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పట్టాలు తయారి భూమి సిద్ధం చేయాలని ఇదే ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా అనుసరించారని వివరించారు.