జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. యలగాల నూకానమ్మ
తెలుగు తేజం, నందిగామ : ఉక్కు కర్మాగారం ఇది కేవలం ఉక్కు కర్మాగారమే కాదని, ఆంధ్రుల ఆత్మాభిమానానికి చిహ్నమని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. యలగాల నూకానమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కర్మాగారం పై ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ కర్మాగారం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే విరి బ్రతుకులు రోడ్డున పడతాయి. విశాఖ ఉక్కు కోసం, దానిని నిలబెట్టు కోవడం కోసం 32 మంది బలిదానం చేసి అమరవీరులైనారు. అలాంటి వీరుల త్యాగఫలం, విశాఖ ఉక్కు కర్మాగారం. అంతే కాకుండా ఆనాడు 66 మంది శాసనసభ్యులు లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కర్మాగారం కోసం. పరిశ్రమ వస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతుంది అని, వేల మంది రైతులు నాడు తమ భూముల్ని అతి తక్కువ ధరలకు ఇస్తే, వాటిని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవాడానికి ప్రయత్నించడం ఏమిటి ? నష్టాల సాకుతో ప్రైవేటు పరం చేస్తారా ? మరి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు కూడ, లక్షల, కోట్లలో, అప్పుల్లో ఉన్నాయి కదా? అంత మాత్రాన ప్రభుత్వాలని కూడ ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు, సంస్థలకు ఇచ్చేస్తారా? ఉక్కు కర్మాగారనికి నష్టలోస్తే, దాన్ని ఏ విధంగా లాభాల్లోకి, తీసుకురావలో పరిశీలించాలిగాని, ప్రైవేటు పరం చెయ్యాలని అనుకోవడం దారుణం. దేశం మొత్తంమీద ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారనికి మాత్రమే సోంత గనులు లేవు- అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు సొంత గనులు, గురించి పట్టించుకోవడం లేదు. అంటే తర తారాలుగా, పాలించేవారి చేతుల్లో అంధ్రులు మేసపోతునే ఉన్నారు. సోంత గనులు లేకపోవడంతో వల్లనే నష్టాలు వస్తున్నాయి. ముందు సోంత గనులు ఏర్పాటు చెయ్యాండి. అంతేగాని, సంస్థాగతంగా ఏ విధమైన లోపాలు లేవు. దాదాపు 22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నడుస్తున్న ఈ సంస్థ, ప్రస్తుత మార్కెట్ విలువ 2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. అంతటి విలువైన సంస్థను, 1500 కోట్లు నష్టాన్ని చూపి కార్పొరేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు ? గతంలో కేరళ లో త్రివేండ్రం విమానాశ్రయాన్ని మరియు తమిళనాడు లో సేలం ఉక్కు కర్మాగారన్ని , ఇలానే ప్రైవేటుకారణం చెయ్యాలి అని చూస్తే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వలు కూడ అసెంబ్లీలో తీర్మానం చేసి (పార్టీలకతీతంగా) ప్రైవేటు వ్యక్తుల, కార్పొరేట్ సంస్థల, చేతుల్లోకి వెళ్ల కుండ కాపాడు కొన్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మౌనం విడాలి. మీడియా సమావేశం పెట్టి తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏపీ అసెంబ్లీలో వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి,ప్రైవేటికరణం చెయ్యాడానికి విలులేదు. అని ఏకగ్రివ తీర్మానం చెయ్యాలని, అప్పుడే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు అని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం, కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈ విషయం గురించి మాట్లాడాలి, పోరాడాలి అని కోరారు.