తెలుగు తేజం, కొండపల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “విశాఖ ఉక్కును”.. అమ్మేస్తున్నాం!అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగ్గా మంగళవారం మీడియా సమావేశంలో విజయవాడ పార్లమెంట్ (రూరల్ ) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా కిరణ్ మాట్లాడుతూ “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయటం ” లో కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం చాల దుర్మార్గం అని అన్నారు. ఆనాడు “విశాఖ స్టీల్ ప్లాంట్ను” పోరాటాలద్వారనే ప్రజలు సాధింరాని,ఆనాడు 32 మంది ప్రాణత్యాగం కూడా చేశారని ,అలాగే వేలాది మంది రైతులు వారి వేలాది ఎకరాలుభూమి ఇస్తేనే ,ఆ రోజు కేంద్రం లో అధికారం లో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ నాటి ప్రధానమంత్రి “శ్రీమతి ఇందిరా గాంధీ” చొరవ తోనే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రము పై ప్రత్యేక అభిమానం తో విశాఖకు ఉక్కు కర్మాగారం వచ్చిందన్నారు. అలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం ఈ రోజు ప్రజలు దేనికయినా సిద్ధముగా వున్నారని,ఐదేళ్ల క్రితం లాభాల్లో ఉందని చెప్పి ,ఇవాళ పరిశ్రమ నడవలేని స్థితిలో ఉందని చెప్పి నష్టాలు చూపించి అమ్మేయడం సరికాదన్నారు.మరి ఈ రోజు రాష్ట్రము లో వున్న ప్రాంతీయ పార్టీ లైన వైస్సార్సీపీ,టీడీపీ మరియు జనసేన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు వదలి వేసి కేంద్రం లో వున్న బీజేపీ ప్రభత్వానికి కొమ్ము కాస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలుచేయటం దర్సదృష్టకరమని అన్నారు.ఇప్పటికి అయినా మించి పోయింది లేదని రాష్ట్రము లో వున్న “ఎంపీ ల మరియు ఎం ల్ ఏ” లందరూ పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలనీ,విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడాలని, కాంగ్రెస్స్ పార్టీ మరియు ప్రజల తరుపున మేము డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమం లో పీసీసీ కార్యదరిశి శ్రీ పోతురాజు ఏసు దాస్,డీసీసీ ప్రధాన కార్యదరిశి అక్కల ప్రసాద్,మునిసిపాలిటీ పార్టీ ఉప అధ్యక్షుడు చెరుకు ఆనందరావు,స్వర్గం కోటేశ్వరరావు మరియు పోతురాజు థామస్ పాల్ తదితర నాయకులూ పాల్గొన్నారు.