తెలుగు తేజం, జగ్గయ్యపేట : విశాఖ స్టీల్ ప్లాంట్ జగ్గయ్యపేట లైం స్టోన్ మైన్స్ మెయిన్ గేటు వద్ద అఖిల పక్ష కార్మిక సంఘాలు బిఎంఎస్, సిఐటియు , ఎఐటియుసి, ఐ ఎన్ టి యు సి, డి ఐ టి యు అధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా కార్మికులకు గత ఏప్రిల్, 2020 నుండి ఆగిన ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని మరియు 2017 జనవరి నుండి అమలు కావలసిన వేతన పెంపుదల ఇప్పటికీ నాలుగు సవంత్సరాలు గడిచిన అమలుకాకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులుకు గురువుతున్నారని అలాగే 2010 నుంచి డిఫికల్టీ ఏరియా స్పెషల్ అలోవెన్సు (డి ఎ ఎస్ ఎ) ను సెయిల్ మైన్స్ లో మాదిరిగా బేసిక్ పై 10% వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. పై సమస్యలును వెంటనే యాజమాన్యం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేసారు. నాయకులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యేవరకు వివిధ రూపాల్లో అందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు పి యస్ న్ రాజు, రామచంద్ర నాయక్, యస్ కృష్ణారావు, సిఐటియు నాయకులు పి.రాజు, డి విజయకుమార్, రాం ప్రసాద్, ఎఐటియుసి నాయకులు జె వి ఏస్ డి , కోటేశ్వరరావు, డి ఐ టి యు నాయకులు యమ్ మరియారావు కంపా వెంకటేశ్వరరావు మరియు మన్నె శ్రీనివాసరావు, సురేంద్ర నాయక్, విక్రమ్, రవితేజ కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.