తెలుగు తేజం, నందిగామ : కార్తీక సోమవారం అమావాస్య రోజును పురస్కరించుకొని మండలం పరిధిలోని జుజ్జూరు గ్రామంలో శ్రీ గిరి పై వేంచేసియున్న స్వయం భూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.
సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి వారికి పంచామృత అభిషేకం, స్నపన,నిర్వహించారు ,తదనంతరం స్వామి వారికి చందనోత్సవం మరియు తులసి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డి వి యస్ కుమార్ స్వామి మాట్లాడుతూ కార్తీక సోమవారం తో కూడిన అమావాస్య ఎంతో విశిష్టమైనది అని . దీనిని పురస్కరించుకొని స్వామి వారి నిజ రూప దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించు కున్నారు.
జుజ్జూరు గ్రామంలో శ్రీ గిరి పై వేంచేసియున్న శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానము నందు కార్తీక ఆఖరి సోమవారం మరియు అమావాస్య ను పురస్కరించుకొని తెల్లవారుజామునుండే భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి యనమదల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ స్వామి వారి కి కార్తీక సోమవారం పురస్కరించుకొని విశేష అభిషేకాలు పూజలను నిర్వహించడం జరిగిందని మంగళ వారం దేవస్థానము నందు కుంకుమ పూజ నిర్వహించటం జరుగుతుందని తెలిపారు