తెలుగు తేజం, జగ్గయ్య పేట : జగ్గయ్య పేట మండల పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో అంగన్ వాడి టీచర్స్ మరియు గ్రామ సచివాలయ మహిళా కార్యదర్శులకు ప్రీస్కూల్ నిర్వహణ కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం మొదటిరోజు సిడిపిఓ గ్లోరీ పాల్గొన్నట్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3 నుండి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా శారీరక మానసిక భాషాభివృద్ధి చెందుతాయని చిన్నారులకు అంగన్వాడీ టీచర్ బొమ్మలు ఫ్లాష్ కార్డ్స్ ద్వారా బోధనా ఉపకరణాలను ఉపయోగిస్తూ ఆట పాట మాట కథ సృజనాత్మక కార్యక్రమాల ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్య మరియు సమగ్ర వికాసం అందించాలని తెలియజేశారు అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య తో పాటు పౌష్టికాహారం అందించే విధంగా శిక్షణా తరగతులు జరుగుతున్నట్లు ఆమె తెలియజేశారు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ దుర్గ దేవి గారితో పాటు షేర్ మహమ్మద్ పేట గండ్రాయి సెక్టార్ సంబంధించిన అంగన్వాడీ టీచర్లు మరియు సచివాలయ మహిళా కార్యదర్శులు పాల్గొన్నారు