తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్రంలో మొదలైన సంక్రాంతి సందడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ఇంటి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు వాకిళ్ళలో ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు సందడిగా ఉంది. ఆయా ప్రాంతాలలో ముగ్గుల పోటీలు వివిధ రకాలైన సాంప్రదాయ ఆటలు పోటీలు జరుగుతున్నాయి. సంక్రాంతి నెల రోజులు గొబ్బెమ్మలు పెట్టి చివరికి భోగిమంటలు వేయడం మన తెలుగు సాంప్రదాయం. అలాగే కొత్త అల్లుల్ల రాకతో పల్లెల్లో సందడి నెలకొంది.