తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం జీవో 90ను జారీ చేసిందని కేడీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల్లో పారదర్శకతను పెంచేందుకు సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశామని స్పందించిన ముఖ్యమంత్రి సహకార సంఘాలలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో ఎంఎస్ నెంబర్ 90 విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం సహకార సంఘాలలో ఒకేచోట 5 ఏళ్లు దాటిన సీఈవో, ఎగ్జిక్యూటివ్‌లను వారి రెవెన్యూ డివిజన్ పరిధిలో వేరే సంఘానికి బదిలీ చేస్తారన్నారు. కొత్తగా నియామకాలు చేపట్టేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో సాధికారత కమిటీలు నియమించినట్టు చెప్పారు.
కొత్తగా తీసుకున్న ఉద్యోగులకు కనీస విద్యార్హతలు నిర్ణయించారు జీవో జారీ చేయడం వల్ల ఏ సి ఎస్ లో అవినీతిని నిర్మూలించడం సాధ్యమని జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ సంఘాల స్వాగతిస్తున్నాయి అన్నారు.