తెలుగు తేజం , మచిలీపట్నం : ఇల్లు నిర్మించుకునే సామాన్యుడికి సైతం ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నియోజకవర్గంలో పలు సమస్యలు వివరించడానికి వచ్చిన ప్రజల ను కలసి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రాజు పేట కు చెందిన ఖాదర్ ఖాన్ తాను గత నెలలో ఆన్లైన్ పద్ధతిలో ఇసుకను తీసుకోవటానికి దరఖాస్తు చేసుకున్నానని అయినప్పటికీ తనకు కు ఇప్పటవరకు ఇసుక అందలేదలి మంత్రి నాని దృష్టికి తీసుకువచ్చారు దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం నూతన ఇసుక విధానం తీసుకురావడం ద్వారా సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులోకి వచ్చిందని తన సొంత ఇంటికి కావాల్సిన ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే సులువైన పద్ధతి అందుబాటులో ఉందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ విధానంలో వినియోగదారునికి ఇసుక దిగుమతి అయిందో లేదో తెలుసుకోవడానికి ఎవరైతే ఇసుక ను బుక్ చేసుకుంటారో వారి ఫోన్కు ఒక ఓటిపి వస్తుంది అని అది నమోదు చేస్తేనే రెండోసారి ఆ వాహనానికి ఇసుక రవాణాకు అనుమతి వస్తుందని, ఈ విధానం వలన నిర్దేశిత ప్రదేశంలో ఇసుక దిగుమతి అయిందో లేదో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. ఇసుకను ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకునే వారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని. ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వారి వివరాలను ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందజేయడం జరుగుతుందని మంత్రి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పేటకు చెందిన కె. రాజ్యలక్ష్మి తనను డ్వాక్రా సంఘంలో తనను తమ గ్రూపు సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలపగా అందరితో సఖ్యతగా ఉండాలని ఆమెకు సూచించారు. ఖలీల్ అహ్మద్ అనే నిరుద్యోగి తనకు ఉద్యోగం కావాలని మంత్రిని అభ్యర్థించారు.కోట కుమారి అనే మహిళ మున్సిపల్ ఉద్యోగిగా ఉన్న తన భర్త చనిపోయాడని ఆ ఉద్యోగాన్ని తన కుమారుడికి వచ్చేలా సహాయం చేయమని అభ్యర్థించారు. అలాగే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తనకు మాట సరిగా రావడం లేదని తన అనారోగ్యానికి మందుల కోసం అధికంగా ఖచ్చు అవుతుందని తనకు వికలాంగ పెన్షన్ ఇప్పించమని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రస్తుతం వికలాంగుల పెన్షన్ కోసం నమోదు ప్రక్రియ నిలిచింది అని అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.