హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్ ఆఫర్. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.