బాపులపాడు (తెలుగు తేజం ప్రతినిధి) :కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెం మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం అధ్యక్షురాలిగా గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మరీదు కృష్ణకుమారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. కృష్ణ మిల్క్ యూనియన్ హనుమాన్ జంక్షన్ పాల శీతల కేంద్రం పరిధిలోని సింగన్నగూడెం గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం సర్వసభ్య సమావేశం సింగన్నగూడెం గ్రామం లో జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం లో రిటైర్ అయిన ఇద్దరూ పాలకవర్గ సభ్యులు స్థానంలో మరీదు కృష్ణకుమారి ని అధ్యక్షురాలిగా పాలకవర్గ సభ్యులుగా చిన్నాల వరలక్ష్మి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు మరీదు కృష్ణకుమారి మాట్లాడుతూ కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారి సహకారంతో సింగన్నగూడెం మహిళా పాల ఉత్పత్తి దారుల సంఘాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు సాయశక్తుల కృషి చేస్తానని పాల రైతులకు హామీ ఇచ్చారు. సింగన్నగూడెం గ్రామంలో సేవకు మారు పేరైన మాజీ గ్రామ సర్పంచ్ మరీదు రోశయ్య కుటుంబం నుంచి మరీదు కృష్ణ కుమారి గారు పాలకేంద్రం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రంగన్న గూడెం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, రంగన్న గూడెం ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాస రావు, గ్రామ ఉపసర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు, రైతు ప్రముఖులు బెజవాడ కిషోర్ బాబు, పల్లగాని వెంకట నాగేశ్వరరావు, దేవరపల్లి ప్రసాదరావు, గుర్రాల శ్రీనివాసరావు, సింగన్నగూడెం పాలకేంద్రం మాజీ అధ్యక్షురాళ్లు పర్వతనేని వరలక్ష్మి , బెజవాడ కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.