ఫలించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కృషి
విజయవాడ పశ్చిమ, నవంబర్ 3: దశాబ్దాలుగా జర్నలిస్టులకు తీరని కలగా మిగిలిన ఇళ్ల స్థలాల సమస్య నేటితో పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యలపై ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగులో ఆయన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆమోద ముద్ర వేసారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి జర్నలిస్టుల సమస్యలు, అక్రీడేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రధానంగా పోరాటం చేసింది. ముఖ్యంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకువెళ్లడంలో ఏపీఎంపీఏ ముఖ్య పాత్ర పోషించిన విషయం జర్నలిస్టులకు విదితమే. ఈ సందర్భంగా ఏపీఎంపీఏ నగర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని, ఈ మేరకు సీఎం స్పందించి జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొంటూ ముఖ్యమంత్రి తో పాటు క్యాబినెట్ మంతులకు, ఈ పథకానికి రూపకల్పన చేసిన సమాచార అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సాధించిన విజయమని వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ పధకం అమలు చేసే విధంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి విలేకరుల మీద బారం పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా గతంలో ఉన్న పది లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ను తక్షణమే పునఃప్రారంబించాలని,20 సం. పూర్తి చేసిన సీనియర్ జర్నలిస్టుల కు నెలకు 10 వేలు పెన్షన్ స్క్రీము ప్రకటించాలని వారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పసుపులేటి చైతన్య, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి అనిల్ కుమార్, గుర్రం శ్రీనివాసరావు, నేతలు వేల్పుల ప్రశాంత్, నాగోతు శ్రీనివాసరావు, దుర్గశి సాయి,జెర్ర కోటేశ్వరరావు, అవనిగడ్డ సురేష్ కుమార్,పి ఆనంద్,కె.శ్రీనివాసరావు తదితరులు సీఎంకు ధన్యవాదాలు తెలిపిన వారిలో ఉన్నారు.