వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామం లోని ఎస్సీ కాలనీ నందు మండల మాజీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరిసే ఝాన్సీ రాణి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను కాలనీ వాసుల మధ్య గ్రామ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తమ సేవా కార్యక్రమాలలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం చలికాలం కావడంతో గ్రామంలో ఉన్నటువంటి 50 మంది వృద్ధులకు గ్రామ పెద్దల చేతుల మీదగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ కరిసే ఝాన్సీరాణి మొదటి నుండి సేవా భావం కలిగిన వారని, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గా ఉన్నా నాడు ఎంతోమంది మహిళలకు చేదోడువాదోడుగా ఉంటూ వారి అభ్యున్నతకు కృషి చేసేవారని, ఎండాకాలం వస్తే గ్రామంలో చలివేంద్రాలు పెట్టేవారని, అలాగే గ్రామంలోని అభాగ్యులకు అనేక రకాలుగా తమ సహాయ సహకారాలు అందించే వారి అని అన్నారు. అలాగే ప్రస్తుత తరుణంలో కాలుష్యం పెరుగుతున్నందున దృష్టిలో ఉంచుకొని గ్రామములో ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇంతటి మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టువంటి ఆమెకు అభినందించారు. ఈ సందర్భంగా కరిసే ఆనందరావు మాట్లాడుతూ ఝాన్సీరాణి నా సతీమణిగా దొరకడం నా అదృష్టం అని, ఆమె సేవా కార్యక్రమాలలో మా కుటుంబం తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న మని అన్నారు. ఈ సందర్భంగా కరిసే ఝాన్సీరాణి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొద్దికాలంలోనే ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాలను అందించారని, ఎవరు కను విను ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం. చుట్టి
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం’ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమే అనవచ్చు నాని అన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కనగాల రమేష్, కొండబోలు నారాయణ, శర్మ , మామిడిపల్లి అప్పారావు, శీలం శ్రీను,గుడేటి దాసు, గుడేటి అనిల్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.