విజయవాడ తూర్పు( తెలుగు తేజం ప్రతినిధి) : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమం రెండు
కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 17వ డివిజన్, గుడ్ మార్నింగ్ టీ స్టాల్ దగ్గర, ఫిడర్ రోడ్డు వద్ద 11లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సైడ్ వాల్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన అవినాష్ పనులను ప్రారంభించారు.