విజయవాడ : నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చెయ్యడంతో.. స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చ జరుగుతోంది. ఈ స్కామ్ ఏంటో తెలుసుకుందాం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయావాడకు తరలిస్తున్నారు. ఇవాళ ఆయన్ని విజయవాడ కోర్టులో హాజరుపరనున్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్నానన్న చంద్రబాబు… ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోంది అన్నారు. తాను ఏ తప్పూ చెయ్యలేదన్న చంద్రబాబు.. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు , ఆయన కొడుకు రవితేజ కూడా అరెస్టు అయ్యారు. అప్పట్లో గంటా… ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబుతో కలిసి APSSDCని గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసి, స్కాంలో పాలుపంచుకున్నారనే ఆరోపణలున్నాయి.
కేసు వివరాలు:
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (APSSDC) కేసులో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. జూన్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ తెచ్చారు. యువతకు స్కిల్స్ డెవలప్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అనీ, 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు.
సీమెన్స్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రావాల్సిన మనీ రాకపోయినా, 5 దఫాలుగా ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదలచేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ మనీ విడుదలైందనే వాదన ఉంది. ఐతే.. స్కిల్‌కి సంబంధించి ఎలాంటి పనీ జరగలేదు, ఎక్కడా ఎలాంటి ట్రైనింగూ ఇవ్వలేదు. మరి ఆ డబ్బు ఏమైపోయిందనే అంశం వివాదాస్పదం అయ్యింది. ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం (MoU) ఒకలా ఉంటే.. మనీ విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో మరోలా ఉందనే వాదన ఉంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్ల మనీ… విదేశాలకు వెళ్లి, తిరిగి దాదాపు 70 షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి, తిరిగి దేశానికి వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఓ విజిల్‌బ్లోయర్ 2018లో ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఐతే.. ఏసీబీ విచారణ సరిగా సాగలేదు. ఆ తర్వాత ఈ స్కాంపై జీఎస్టీ , ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ… ఇలా చాలా ఏజెన్సీలు దర్యాప్తు చేశాయి. ప్రస్తుతం ఈ కేసు ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (APSSDC) కేసులో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. జూన్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ తెచ్చారు. యువతకు స్కిల్స్ డెవలప్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అనీ, 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు.
సీమెన్స్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రావాల్సిన మనీ రాకపోయినా, 5 దఫాలుగా ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదలచేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ మనీ విడుదలైందనే వాదన ఉంది. ఐతే.. స్కిల్‌కి సంబంధించి ఎలాంటి పనీ జరగలేదు, ఎక్కడా ఎలాంటి ట్రైనింగూ ఇవ్వలేదు. మరి ఆ డబ్బు ఏమైపోయిందనే అంశం వివాదాస్పదం అయ్యింది. ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం (MoU) ఒకలా ఉంటే.. మనీ విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో మరోలా ఉందనే వాదన ఉంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్ల మనీ… విదేశాలకు వెళ్లి, తిరిగి దాదాపు 70 షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి, తిరిగి దేశానికి వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఓ విజిల్‌బ్లోయర్ 2018లో ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఐతే.. ఏసీబీ విచారణ సరిగా సాగలేదు. ఆ తర్వాత ఈ స్కాంపై జీఎస్టీ , ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ… ఇలా చాలా ఏజెన్సీలు దర్యాప్తు చేశాయి. ప్రస్తుతం ఈ కేసు ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది.