- దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్థాన సాధన
- జనావాసాలే ప్రస్థాన సాధన వేదికలుగా
- ఆరవ రోజుకు చేరుకున్న ప్రస్థాన సాధన
ఆధ్యాత్మిక విశ్వ గురువు వైజ్ఞానిక ఋషి ఆకాశమార్ఖాన విహరిస్తున్న సనాతన ఆధ్యాత్మిక భావజాలాన్ని భూమార్గం పట్టించిన ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి వారి మరో వినూత్న ప్రయోగం ప్రస్థాన సాధన.
మనిషిలో అంతకంతకు కనుమరుగవుతున్న మానవత్వాన్ని మేల్కొల్పి ఆత్మీయత మానవ సమాజ స్థాపనే ధ్యేయంగా తమ సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులను ప్రభావితం చేస్తున్న శ్రీ శ్రీ గురు విశ్వస్పూర్తి వారు సిద్ధాంతాన్ని అందించడమే కాకుండా ఆచరణాత్మకంగా వారు అనుసరించి విశ్వమాత స్థాయికి చేరుకొని వారు అనుసరించిన మార్గాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా భక్తులకు అందించడం వారి విశిష్టత.
అంతేకాకుండా శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అందిస్తున్న ఈ సిద్ధాంతం సామాన్యులు సైతం అనుసరణీయమైనదని ఆధ్యాత్మికం కొందరి సొత్తు కాదని నేడు ప్రతి ఇల్లు ప్రస్థాన సాధన వేదికలుగా ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు. ప్రతి మనిషిలో మంచి చెడు ఉండడం పకృతి ధర్మం అని చెడుని తగ్గించి మంచిని పెంచుకోవడమే మనిషి చేయవలసినదని దానికి ప్రస్థాన సాధనా విధానమే ఏకైక మార్గమని ప్రస్థాన సాధన శిబిరాల్లో పాల్గొంటున్న సాధకులు తెలుపుతున్నారు.
శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్పూర్తి వారు ప్రతిపాదిస్తున్న ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానం ద్వారా దృఢమైన శరీరాన్ని ఆరోగ్యవంతమైన మనసుని ప్రశాంతమైన జీవనాన్ని, జీవితాన్ని కొనసాగించడానికి తద్వారా సమాజంలో మంచి మనుషులుగా రూపొందడానికి ఉపయోగపడుతుందని సాధకులు తెలుపుతున్నారు. వ్యక్తుల సమూహమే సమాజమని శ్రీ శ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి వారు ప్రబోధిస్తున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాదనామార్గాన్ని వివరించడమే కాకుండా ఒక పైసా ఖర్చు లేకుండా ఎవరి ఇంటిలో వారు పరిశుభ్రమైన వాతావరణంలో తెల్లవారుజామున అత్యంత క్రమశిక్షణ తో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో సాధన చేయడానికి ఆశీస్సులు అందించిన శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి వారికి సాధకులు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ప్రతిఇల్లు ఒక ప్రస్థాన సాధన వేదికగా మారినప్పుడు తప్పకుండా ఆత్మీయత సమాజం ఏర్పడడం తధ్యమని వారు వివరించారు