హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ల బుకింగ్ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు 37 స్లాట్లు బుక్ చేసుకున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా ఇప్పటివరకు రూ.85 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు ప్రారంభమైనట్లు చెప్పారు. రూ.200 చెల్లించి మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు సీఎస్ తెలిపారు. పోర్టల్ ద్వారా సులువుగా డాక్యుమెంట్ కూడా తయారు చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. బిల్డర్లు, డెవలపర్ల కోసం ప్రత్యేక విండో ఏర్పాటు చేసినట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఇవాళ రాత్రి 7 గంటల వరకు 451 మంది బిల్డర్లు 93వేలకుపైగా కొత్త ఆస్తులను నమోదు చేసినట్లు చెప్పారు.