తెలుగుతేజం,మంగళగిరి : పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో తలిహ స్వామి (స్వామివారి ప్రసాదం తయారీ పని) గా పని చేస్తున్నటువంటి బెల్లం బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి స్పందించి హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ, తమిళ్ నాడు, కేరళ రాష్ట్రాల ఇంచార్జ్ జార్జ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర ఉమెన్ పోర్ట్ ఉపాధ్యక్షులు ముల్పూరి హారిష, ఉమెన్ పోర్ట్ వెల్ఫేర్ సెక్రెటరీ పూలపల్లి సౌజన్య బాలసుబ్రమణ్యం ను తన నివాసంలో కలిసి పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరిష మాట్లాడుతూ గుడిలో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ చొరవ తీసుకుని వైద్య ఖర్చులు, ఆర్థికంగా వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు, సంఘటన జరిగిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ కె ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే బాధితుడికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని గుడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అని తెలుసుకొని ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా అధికారులు వల్ల ప్రజలకు త్వరితగతిన సమస్యలు తీరుతాయని తెలిపారు. బాధితుడికి హ్యూమన్ రైట్స్ మిషన్ తరుపున రు.5501/- ఆర్థిక సహాయం అందజేశారు. తదనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హ్యూమన్ రైట్స్ మిషన్ తరఫున హామీ ఇచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు త్వరగా కోలుకోవాలని, దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ అధ్యక్షులు కేతన సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, జిల్లా మీడియా సెక్రెటరీ షేక్ అమన్, మంగళగిరి పట్టణ మీడియా సెక్రెటరీ సాంబశివరావు పాల్గొన్నారు.