తెలుగు తేజం, కంచికచర్ల : కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు దొనబండ క్వారీలకు వెళ్లే రహదారిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సమాచారంపై దాడులు చేసిన పోలీసులు నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోమలి రామకృష్ణ, అఘ్యారామ్ రాంలఖన్ విమల్, జలంధర్ అబ్దుల్ రజాక్ ,కొండేపూడి స్వరూప అనే వ్యక్తులు రెండు కార్లలో గంజాయ్ ప్యాకెట్లను ఒక కారు నుండి మరొక కారు లోకి మార్చుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. పట్టుబడిన సమయంలో రెండు కార్లలో 120 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అన్నవరం నుండి ముంబైకు గంజాయి సప్లై అవుతున్నట్లు రాబడిన సమాచారం మేరకు నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్ఐ రంగనాథ్, చందర్లపాడు ఎస్ ఐ మణి కుమార్ లు తమ సిబ్బందితో కలసి ఒక మహిళ తో సహా నలుగురు వ్యక్తులను పట్టుకోగా మరొక ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిని అరెస్టు చేయవలసి ఉందని డి.ఎస్.పి తెలిపారు. ముద్దాయిలు వద్ద నుండి 120 కేజీల గంజాయి తో పాటు AP05CM4949,MH01AL1297, నెంబరు గల రెండు కార్లు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించిన సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు