హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ కొనసాగుతోంది. ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చిన 48 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ రుసుం ద్వారా రూ.కోటి ఆదాయం సమకూరిందని చెప్పారు. ఇవాళ సాయంత్రం వరకు 10,509 మంది నమోదు చేసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు.