హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అప్పటి నుంచి దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈకేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక హత్రాస్ లోని బుల్గర్హి గ్రామంలోని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు అనేకమంది వస్తున్నారు. దీంతో హత్రాస్ లోని బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. గ్రామంలోని ఆ కుటుంబం ఇంటిదగ్గర 60 మంది పోలీసులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 8 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం పహారా కాస్తున్నారు. ఇంటికి వచ్చేవారి కోసం రిజిస్టర్ ను ఏర్పాటు చేసింది. అంతేకాదు డిఐజి అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించింది. అవసరమైతే బాధితురాలి ఇంటి దగ్గర కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసును ఇప్పటికే యూపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అదే విధంగా ఈ కేసులో సిట్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.