బొగ్గు గనుల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. 1999లో అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వంలో జార్ఖండ్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో దిలీప్ రే బొగ్గుగనుల సహాయ మంత్రిగా ఉన్నారు.ఈనెల 6న మాజీ మంత్రి దిలీప్ రేను దోషిగా తేల్చిన కోర్టు సోమవారం జైలు శిక్ష ఖరారు చేసింది.
దేశంలోనే ప్రముఖమైన కుంభకోణంగా అప్పట్లో జార్ఖండ్ లో వెలుగు చూసిన బొగ్గు కుంభకోణం రాజకీయాలను షేక్ చేసింది. నాటి సీఎం ‘శిబుసోరేన్’పై కూడా దీనిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది.
ఈ బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ తోపాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పు బీజేపీ ని ఇరుకునపెట్టినట్టైంది. ఇందులో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి ఉండడంతో విమర్శలు చెలరేగుతున్నాయి.