తెలుగు తేజం, అవనిగడ్డ : కృష్ణ జిల్లా మోపిదేవిలో గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో బుధవారం జరిగే నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆలయం ప్రాగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం రంగు రంగుల దీపకాంతులతో దగదగ లాడుతోంది.స్వామి వారు బుధవారం తెల్లవారుజామున 2.30 తర్వాత భక్తులకు దర్సనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబందులు లేకుండా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.