దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. మరోవైపు డిసెంబర్ 3న రైతు సంఘాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కాగా ముందస్తు చర్చలపై కేంద్ర ప్రతిపాదనను రైతులు తిరస్కరించడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అనే అంశాలపై కేంద్ర మంత్రులు చర్చించినట్లు సమాచారం.