తెలుగు తేజం, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం రైతులను ఆదుకోవాలని వరి కంకులు పట్టుకుని అసెంబ్లీకి చంద్రబాబు కాలినడకన చేరుకున్నారు.అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేశారు. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ.. ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నదాతలకు కలిగిన నష్టాన్ని తెలిపే రీతిలో వర్షానికి దెబ్బతిన్న పంట కంకులతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.