తెలుగు తేజం గుడివాడ : గుడివాడ స్టేడియం కమిటీకి శనివారం నిర్వహించిన ఎన్నికలు ఉత్కంఠకు తావు లేకుండా ఏకగ్రీవంగా ముగిశాయి. మంత్రి కొడాలి నాని తరఫున వేసిన 14 మందితో కూడిన ప్యానల్ తప్ప వేరెవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీవో జి.శ్రీనుకుమార్ కొడాలి నాని తరఫున వారే గెలిచినట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శ్థిగా పర్వతనేని ఆనంద్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కానుమోలు సత్యనారాయణ, రాజీవ్‌కుమార్ జీవావత్, బొగ్గవరపు తిరుపతయ్య, కిలారపు రంగప్రసాద్, పొట్లూరి వెంకటకృష్ణారావు, దొప్పలపూడి రవికుమార్, నెరుసు శేషగిరిరావు, ప్రవీణ్ కుమార్ జైన్, వల్లభనేని కృష్ణవరప్రసాద్, పర్వతనేని రూప లావణ్య, చింతా రఘుబాబు, పోలవరపు రాజగోపాలరావు ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గాన్ని మంత్రులు కొడాలి నాని అభినందించారు. ఈ ఎన్నికలు మంత్రి కొడాలి నాని కి ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో ప్యానెల్ తయారీ దగ్గరుండి నామినేషన్ ప్రక్రియ వరకు ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం తో పోటీ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత క్రీడాకారులకు వరమైన ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎన్టీఆర్ ఎన్నో ఆశలతో ఈ స్టేడియం నిర్మించారని వీటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు ప్రభుత్వం ద్వారా స్టేడియం అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. గుడివాడ పట్టణం నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి ని బారి గజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ మున్సిపల్ మాజీ చైర్మన్ లంక దాసరి ప్రసాదరావు మాజీ వైస్ చైర్మన్ కడప బాబ్జి పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను వైసీపీ నేత పాలడుగు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు