భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ వర్చువల్ మీటింగ్ లో జగ్గయ్యపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రముఖులు పాల్గొని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పలు ప్రధాన బాధ్యతలను జగ్గయ్యపేట బృందానికి అప్పగించ బోతున్నదని ఎటువంటి బాధ్యతలు లేకుండా ఇప్పటివరకు నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేస్తూ భాజపాకు బలాన్ని చేకూర్చిన భాజపా నేతలకు అతి త్వరలోనే తీపి కబురు రాష్ట్ర బృందం చెప్పబో తుందా లేదా అనే అంశంపై అతి త్వరలోనే సమాధానం రాబోతుందని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేసేందుకు నేడు యువత పనిచేస్తుందని శనివారం జరిగిన మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేసర రాంబాబు తెలియజేశారు