Breaking News

బహుముఖ ప్రజ్ఞాశాలి,ప్రముఖ జర్నలిస్ట్ ,సాహితీ,సామాజికవేత్త జాలె వాసుదేవ నాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రధానం

తెలుగు తేజం : తమిళనాడు రాష్ట్రంలోని,బెంగళూరు కి సమీపంలో గల హోసూరులో శనివారం ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ల ప్రదోనోత్సవం జరిగింది. “యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన ప్రముఖులకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేశారు. నెల్లూరు కి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ పాత్రికేయుడు, “జె ఎన్ ఐ” ఛానెల్ అధినేత సామాజిక,విద్యా వేత్త,తెలుగు,తమిళ సినీ నటుడు,నిర్మాత జాలే వాసుదేవ నాయుడు కి వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ని ప్రధానం చేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రముఖులతోపాటు కన్నడ నటుడు,దర్శకుడు,నిర్మాత ఎస్ నారాయణ, తమిళనాడు పీపుల్స్ పార్టీ కార్యాధ్యక్షులు డా.ఎస్.శశిహార్విన్, హోసూరు మాజీ శాసన సభ్యులు డా.కె.ఏ.మనోహరన్, తమిళనాడు చైల్డ్ ప్రొటెక్షన్ మాజీ చైర్ పర్సన్ డా.వై మరియదాస్,హోసూరు ఇంద్రాక్షి పీఠం స్వామి బ్రహ్మరిషి ,తెలుగు తేజం సంపాదకులు డా.ఎం.మాల్యాద్రి, ప్రముఖ న్యాయవాది గణేశ్వరన్ తదితరులు ఈ డాక్టరేట్ల ప్రధానోత్సవ సభలో అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అత్యధిక తెలుగు భాషాభిమానులు,సాహివేత్తలు ఉన్న హోసూరు లో ప్రముఖ తెలుగు భాషా ప్రముఖులు ఇతర నాయకులు రఘునాథరెడ్డి, బి. చంద్రాచారి, రామస్వామి రెడ్డి, స్థానిక మాజీ శాసన సభ్యుడు వెంకటస్వామి తదితరులు జాలే వాసుదేవనాయుడుని అభినందించి వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా వాసుదేవ నాయుడు మాట్లాడుతూ తాను తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ కళా సాంస్కృతిక,విద్యారంగముల కేంద్రం నెల్లూరు లో మరియు తెలుగు రాష్ట్రాలలో తనకున్న ఆర్ధిక వనరులతో సామాజిక,సాంస్కృతిక సాహిత్య,జర్నలిజం,సినీ,విద్యారంగాలలో తాను చేసిన సేవా కార్యక్రమాలను ఎక్కడో ఉన్న తమిళనాడులోని ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు.1994-95 విద్య సంవత్సరం నుండి నెల్లూరు లో పాఠశాలను ప్రారంభించి ఎందరికో నిరుపేద విద్యార్థులకు ఫీజులు లేకుండా విద్యను అందించేందుకు తన వంతు కృషిచేసినట్లు చెప్పారు.ఎందరో నిరుద్యోగులు,విద్యను పూర్తీ చేసినవారికి పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇవ్వటంద్వారా పలువురు ఉద్యోగాలు సంపాదించేందుకు అవకాశం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ ని తన ఆధ్వర్యంలో స్థాపించానని అది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి హక్కులను పరిరక్షించుకుంటోందన్నారు. 2006 సంవత్సరంలో చెన్నై నగరంలో నటన మరియు దర్శకత్వ రంగాలలో శిక్షణ పొంది సినీరంగ ప్రవేశం చేసిన తాను పలు తెలుగు,తమిళ్ చిత్రాలలో విలన్ గా నటించి తన వంతుగా మంచి నటుడిగా పేరు సంపాదించానన్నారు. సినీ నిర్మాతగా మరియు నటుడుగా మొత్తం ఎనిమిది సినిమాలు చేశానని,వాటిలో మనీ ఈజ్ హనీ,బిట్రగుంట,తోపు-తురుము, సమయం తదితర సినిమాలు ఉన్నట్లు నాయుడు పేర్కొన్నారు.జర్నలిజం రంగంలోకి ప్రవేశించి తన వంతుగా జర్నలిస్టులు,ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా (ఏపీజేయు) వ్యవస్థాపక అధ్యక్షునిగా యూనియన్ ద్వారా తనవంతు గా కృషి చేస్తున్నట్లు చెపుతూ ఒక విద్యావేత్తగా ప్రపంచంలోనే ఫోర్త్ ఎస్టేట్ గా ప్రసిద్ధి చెందిన జర్నలిజం లో నేడు అవాంఛనీయ ధోరణులు,అసాంఘిక శక్తులు ప్రవేశించి బ్రష్టు పట్టిస్తుండటం ఆవేదన కల్గుతోందన్నారు.దీన్ని అరికట్టే దిశలో తమ పోరాటం ఫలించి ప్రభుత్వం సరైన దారిలో పెట్టేందుకు తీసుకున్న చర్యలు సంతోషం కల్గిస్తున్నాయని వాసుదేవ నాయుడు ఈసందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *